ఉచితాల పంపిణీ భవిష్యత్ లో కచ్చితంగా ఆర్థిక విపత్తుకు దారితీస్తుందని కేంద్రం... సుప్రీంకోర్టుకు తెలిపింది. రాజకీయ పార్టీలు, ఎన్నికల సమయంలో హామీలు గుప్పించే విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి పూర్తిస్థాయిలో మద్దతు పలికింది. ఈ మేరకు CJI జస్టిస్ NV రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట కేంద్రం తన వైఖరిని తెలియజేసింది.ఉచితహామీల సమస్యను ఎన్నికల సంఘమేపరిష్కరించాలని గతంలోనే కేంద్రం పేర్కొన్న నేఫథ్యంలో తాజా వైఖరి ప్రాధాన్యం సంతరించుకుంది. గతనెల 28న జరిగిన విచారణలో ఎన్నికల సంఘం......... ప్రభుత్వంపైనే భారం వేసింది. మరోవైపు బుధవారం జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ కేంద్రం, నీతి ఆయోగ్, ఆర్థిక సంఘం, RBIలు సహా కేసులోని అందరు భాగస్వాములు.. ఉచితాలపై సమాలోచనలు జరిపి.. పరిష్కారం కోసం నిర్మాణాత్మక సూచనలతో రావాలని కోరింది. ఆ తర్వాత తీవ్రమైన ఈ అంశంపై తాము కమిటీని ఏర్పాటు చేస్తామని ధర్మాసనం పేర్కొంది.#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

0 Comments